Latest Posts

పరుగులు పెడుతున్న ప్రపంచం ప్రపంచీకరణతో తల దించుకోవాల్సిందేనా?

పరుగులు పెడుతున్న రంగుల ప్రపంచం
ప్రపంచీకరణతో తల దించుకోవాల్సిందేనా?

1947-2023 స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యింది.
2023 జనవరి1 ముందురోజు డిసెంబర్ 31. ప్రపంచమంతా సంబరాలు.
ఇది ఆంగ్ల సంవత్సరాది అయినా మనం ఎంతో ఉత్సాహంగా
హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సన్నిహితులకు, బంధుమిత్రులకు
శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మరి ఈసారి అలాగే శుభాకాంక్షలు చెప్పేసుకున్నాం.ప్రపంచ ప్రయాణానికి ఒక్క ఈమెయిల్ ఐడి చాలు ప్రపంచీకరణతో యావత్ ప్రపంచ జనం అంతా ఒకే వేదికపైకి వచ్చేశారు. గూగుల్ అందర్ని దగ్గర చేసేసింది. ఫేస్ బుక్ ఎల్లలు చెరిపేసింది. ఇన్ స్టాగ్రామ్, హద్దులు దాటించేసింది.
ట్విట్టర్ నేను తక్కువా అంటూ అన్నింటా నేనే ముందు అంటూ వచ్చేసింది.ఒక్క ఈమెయిల్ అడ్రస్సు మన జీవితాలను ప్రపంచంతో ముడిపెట్టేసింది.పాత తరం ఉత్తర ప్రత్యుత్తరాలు పోయాయి. డిజిటల్ మానియా సాగుతోంది.మనియార్డర్, టెలిగ్రామ్ లు పోయాయి. వాట్సప్ తరహాలో టెలిగ్రామ్ కు బదులుగా టెలిగ్రామ్ వచ్చింది. మనియార్డర్ కు బదులు పోన్ పేలు వచ్చేశాయి.ఉత్తరానికి బదులు వాట్సప్ సందేశం వచ్చింది. ఫోటోలు, వీడియోలు, గ్రాఫిక్ లు ఏదైనా సంస్థ గాని, వ్యక్తి గాని నమ్మకం కుదరాలంటే ఎంతో సమయం పట్టేది.మరి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, వాట్సప్ లలో హాయ్ అంటే హాయ్ అంటూ వెంటనే రిప్లై వస్తుంది. కళ్లలోకి చూసేందుకే భయపడే యవ్వన మస్తిష్కాలు ఇప్పుడు రివ్వున బైక్ లపై షికార్లు చేస్తున్నాయి.ఎదుటపడి మాట్లాడాలంటే సంవత్సరాల తరబడి వేచి చూసే ఓపిక నేటి తరానికి లేదు.
చూశామా.. నెంబర్ తీసుకున్నామా.. వాట్సప్ చేసామా..

Latest Posts

Don't Miss