Latest Posts

జీవో నెం.01 నిషేధం కాదు ప్రజల ప్రాణాలకు భరోసా-సజ్జల రామకృష్ణారెడ్డి

 

జీవో నెం.01 నిషేధం కాదు ప్రజల ప్రాణాలకు భరోసా…

కందకూరు, గుంటూరు ఘటనల అనంతరం బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలపై ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రజల ప్రాణాలకు సంబంధించి బాధ్యతాయుతమైన చర్యగా తీసుకున్నదేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాల అజాగ్రత్త కారణంగానే కదకూరు, గుంటూరు సభల్లో పాల్గొన్న ప్రజలు బలైపోయారు. ఈ ఘటనలు పునరావ`తం కాకుండా అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే దిశగా మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ జీవో రాష్ర్టంలో మరింత జాగ్రత్తగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలనే సందేశాన్ని బాధ్యతను పెంచనుందన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించొద్దని తాము చెప్పలేదన్నారు.రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన జీవో ఆర్‌టి నెం.01కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి.

ప్రతిపక్షాల ఆరోపణ:జీవో ప్రశ్నించే స్వరాలను అణిచివేస్తోంది.
వాస్తవం: బహిరంగ సభలు నిర్వహించకుండా నిషేధం విధించినట్లు జిఓలో ఎక్కడా పేర్కొనలేదు. ప్రజల భద్రత కోసం సరైన వసతులు కల్పించని నేపథ్యంలో జాతీయ రహదారులతో సహా రోడ్లపై బహిరంగ సభలు మరియు ర్యాలీలను GO నిషేధించింది.

ప్రతిపక్షాల ఆరోపణ:మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎమర్జెన్సీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వాస్తవం: సమావేశాలకు అనుమతి మంజూరు చేయబడుతుందని జీవో స్పష్టంగా పేర్కొంది. అయితే భద్రతకు ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రోడ్డు వెడల్పు, లొకేషన్, ఎగ్జిట్ పాయింట్లు, సమావేశానికి హాజరయ్యే వ్యక్తుల సంఖ్య, ఇతర అంశాల్లో సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇచ్చే ముందు అన్ని అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రతిపక్షాల ఆరోపణ:జీవో అనేది నిరంకుశ నిర్ణయం
వాస్తవం: “సమావేశాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదనే షరతులకు లోబడి పబ్లిక్ ప్లేస్లు రోడ్ లకు దూరంగా ప్రత్యామ్నాయ ప్రదేశాలను సూచించే” స్వేచ్ఛ పోలీసులకు మరియు జిల్లా పరిపాలనా యంత్రాంగానికి ఉందని జీవోలో స్పష్టం చేయబడింది..

Latest Posts

Don't Miss