Latest Posts

జీవోపై కోర్టుకెళ్తాం-నాగబాబు

ఈ జీవోపై కోర్టుకెళ్తాం, కోర్టులో అసలు ఈ జీవో నిలబడుతుందా అని నాగబాబు ప్రశ్నించారు. కోర్టులో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదన్నారు. రాజకీయ పార్టీల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, పోలీసుల ద్వారా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న చాలా పెద్ద తప్పు ఇది అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఎలా ఆపగలరని ప్రశ్నించారు. పవన్ , చంద్రబాబు లాంటి నేతలను ఎంత ఆపితే అంత బౌన్స్ అవుతారన్నారు. జీవో నెం.1 పై రాజకీయ పార్టీల పరంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ జీవోపై కచ్చితంగా కోర్టుకు వెళ్తామన్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు. కోర్టుతో మొట్టికాయలు తినేలోగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి మాత్రమేనని, రాజు కాదని విమర్శించారు.

Latest Posts

Don't Miss