ఒక లాయరు నలభై ఆరు మంది దోషుల్ని ఉరిశిక్ష నుండి విడుదల చేయించాలని కోర్టులో సీరియస్‌గా వాదిస్తున్నారు. లాయర్‌గారి అసిస్టెంట్ చిన్న చీటీ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసుకుని…లాయర్ గారు దాన్ని జేబులో పెట్టుకుని, తన వాదన కొనసాగించారు. ఇంతలో లంచ్‌టైం అయ్యింది. వాదిస్తుండగా మధ్యలో వచ్చిన చీటీ ఏమిటని న్యాయమూర్తి లాయర్‌ను అడిగాడు. ”నా భార్య చనిపోయింది జడ్జి గారూ…” అని చెప్పాడు లాయరు దీనంగా. జడ్జి గారు ఆశ్చర్యపోయి ”ఇంకా ఇక్కడేం చేస్తున్నారూ? ముందు వెళ్ళండి. ఇంటికి వెళ్ళండి!” అని అరిచినంత పనిచేశాడు జడ్జి.”అయ్యా! నేను వెళ్ళి నా భార్య ప్రాణాలు తీసుకురాలేను. ఇక్కడ ఉండి వాదించి, నలభై ఆరు మందిని ఉరిశిక్ష నుండి రక్షించగలనేమో కదా?” అని అన్నాడు లాయర్ ఆశగా.అది విన్న బ్రిటిష్ జడ్జి నలభై ఆరు మందిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
ఆ నలభై ఆరు మంది స్వాతంత్య్ర సమరయోధులు!
ఆ లాయరు మరెవరో కాదు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్!
ఈ స్థాయి దేశభక్తి ఉంటుందని నేటి ఈ కాలపు ఈ దేశభక్తులకు కనీసం అర్థమవుతుందా? ఏమో? అనుమానమే. అంబేద్కర్ సాక్షిగా ఆలోచనాపరులు మొదలు పెట్టిన శాంతి ఉద్యమ కాగడాను ప్రజలు అంది పుచ్చుకోవాల్సి ఉంది..