• స్వధర్మ వాహిని ఆధ్వర్యంలో సరస్వతీ ఆరాధన
  • వీణా వాయిద్యంపై ఉచిత శిక్షణ ఇస్తామన్న స్వాత్మానందేంద్ర స్వామి

విశాఖ శారదాపీఠం వేదికగా స్వధర్మ వాహిని సంస్థ ఆదివారం వీణా పంచకం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సరస్వతీ దేవికి నాద నివేదన అందించారు. సుప్రసిద్ధ కళాకారులు డాక్టర్‌ కృష్ణవేణి, శారదా సుబ్రమణియన్ నిర్వహణలో మృదంగ విద్వాంసులు మెహర్‌ సాగర్‌ సహకారంతో నిష్ణాతులైన కళాకారులు వీణా వాయిద్యంతో అలరించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి వీణా పంచకాన్ని వీక్షించి కళకారులను ఆశీర్వదించారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో స్వధర్మ వాహిని వీణా పంచకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సరస్వతీ ధరించే వీణ ప్రాచీనమైన కళ మాత్రమే కాదని, పవిత్రమైనదిగా హిందువులు గుర్తించాలని అన్నారు.

విశాఖ శారదాపీఠం లో ఉచిత శిక్షణ

విశాఖ శారదాపీఠం
విశాఖ శారదాపీఠం

వీణా వాయిద్యం కనుమరుగువు అవుతోందని, ఈ కళను ప్రోత్సహించడానికి విశాఖ నగరంలో పలుచోట్ల సామూహిక ఉచిత శిక్షణను స్వధర్మ వాహిని సంస్థ ద్వారా అందించదలిచామని తెలిపారు. సంగీతంలో ఉండే మాధుర్యాన్ని వీణా వాయిద్యం ద్వారా తెలుసుకోవచ్చని, భవిష్యత్‌ తరాలకు ఈ కళను అందించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు వీణా వాయిద్యం గొప్పతనాన్ని చెప్పాలని కోరారు. విశాఖ జిల్లాకే తలమానికంగా స్వధర్మ వాహిని సంస్థ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. లీలారాణి, జాస్తి బాలాజి, సురేష్‌బాబు, విక్రమ్‌ ఆదిత్య వర్మ, కేవీఎస్‌ఏ వర్మ, సత్యేంద్ర, గ్రంధి రాజేష్, వేంకటేశ్వర బెనర్జీ తదితరులతో కూడిన స్వధర్మ వాహిని కమిటీ ప్రతినిధులను ఈ కార్యక్రమంలో స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర అభినందించారు.

ఇవి కూడా చదవండి :

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన రక్షణ శాఖ సలహాదారులు