Latest Posts

వాస్తవ ప్రేమకథలను పరిచయం చేయడం సంతోషంగా ఉంది -సినీ నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాదినేని

 

వాస్తవ ప్రేమకథలను పరిచయం చేయడం సంతోషంగా ఉంది -సినీ నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాదినేని

  • ★ శ్రీ జయా ఆర్ట్స్ హైదరాబాద్ వారి పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 30, 31 తేదీలలో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని లమాకాన్ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శించిన సావరియా తెలుగు ట్రయాలజీ నాటకం మొదటి భాగం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
  • ★ సంస్థ వ్యవస్థాపకురాలు డా.శ్రీజ సాదినేని రచించి, దర్శకత్వం వహించి, నటించి, నిర్వహించిన ఈ నాటకం ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన ప్రేమైక జీవుల వాస్తవ కథలను పాత్రలుగా మలచి నాటక ప్రియుల కళ్ళకు కట్టినట్లుగా రూపొందించిన విధానం ఆహూతులను అలరించింది.
  • ★ తమ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు యాక్టింగ్ లో శిక్షణ ఇస్తూ ఇప్పటివరకు 31 వర్క్ షాప్ లను నిర్వహించిన శ్రీ జయా ఆర్ట్స్ ఇప్పుడు కూడా తన విద్యార్థులతో ప్రదర్శింపజేసిన ఈ నాటకం చూపరుల కంట కన్నీరు తెప్పించింది.
  • ఈ సందర్భంగా డా.శ్రీజ సాదినేని మీడియాతో మాట్లాడుతూ..
  • ★ వాస్తవంగా జరిగిన ప్రేమ కథలను నాటకంగా మలచి పాత్రల చిత్రీకరణ కూడా అలాగే రూపకల్పన చేసినట్లు, తెలుగు వారికి తెలియని ఈ పంజాబీ ప్రేమకథలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని అందుకే వాటిని తెలుగు నాటకంగా రూపొందించి తన విద్యార్థులతో ప్రదర్శింప చేశానని మిగిలిన రెండు భాగాలలో కూడా మరి కొన్ని వాస్తవ ప్రేమకథల ను పరిచయం చేస్తానని తెలిపారు.
  • ★ నాటక రంగంలో యువత ఆసక్తి కనబరుస్తూ శ్రీజ సాదినేని దర్శకత్వంలో నటించగలిగినందుకు ప్రముఖులు శ్రీజ సాదినేని మరియు విద్యార్థులను అభినందించారు.

వాస్తవ ప్రేమకథలను పరిచయం చేయడం సంతోషంగా ఉంది -సినీ నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాదినేని  వాస్తవ ప్రేమకథలను పరిచయం చేయడం సంతోషంగా ఉంది -సినీ నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాదినేని

Latest Posts

Don't Miss