Latest Posts

బాలకృష్ణ ‘NBK 108’ నుంచి కీలక అప్డేట్​

 

జైల్లో బాలకృష్ణ న్యూఇయర్​ సెలెబ్రేషన్స్.. ‘NBK 108’ నుంచి కీలక అప్డేట్​

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK 108 సినిమా నుంచి క్రేజీ అప్టేట్​ వచ్చింది.

– ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వివరాలు వెల్లడించింది.

– దానికి సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేసింది.

★ నటసింహం నందమూరి బాలకృష్ణ వెండితెరపై వెలుగుతూనే.. బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

★ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

★ తాజాగా బాలకృష్ణ కొత్త ప్రాజెక్టు గురించి అప్డేట్​ వచ్చింది.

★ అనిల్​ రావిపూడి కలయికలో ఓ సినిమా వస్తోంది.

  •  ఈ మూవీ NBK108 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది.
  •  ఈ సినిమా మొదటి షెడ్యూల్​ను ముగించుకుంది.
  •  ఈ మేరకు జైలు సెట్​లో యాక్షన్​ సీక్వెన్స్​ షూటింగ్​ ముగించుకున్నట్లు చిత్ర బృందం సోషల్​ మీడియా వేదికగా తెలిపింది.
  •  ఈ సందర్భంగా సెట్​లో చిత్ర యూనిట్​తో కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు బాలయ్య.
  •  ఇందుకు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ శైన్ స్క్రీన్స్​ సోషల్​ మీడియాలో ఫొటోలు విడుదల చేసింది.
  •  ఈ సినిమాకు హరీష్​ పెద్ది, సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
  •  తమన్​ ఎస్​ సంగీతం సమకూరుస్తున్నారు.
  •  నటసింహం నటిస్తున్న ఈ సినిమా మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. ​
  •  ఈ సినిమా జూన్​ 2023లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. కాగా, బాలకృష్ణ మాస్​ మూవీ వీరసింహారెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది.
  •  ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.
  •  మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌ అలరించనుంది.
  •  సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
  •  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
  •  ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

Latest Posts

Don't Miss