క్యాన్సర్ రోగులకు చికిత్సే కాదు… మానసిక స్థైర్యం కూడా నింపుతున్నాం
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 బెడ్స్‌ను ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
- – త్వరలో రేడియేషన్ యంత్రం, రెండవ పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని కూడా పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు.
★ క్యాన్సర్ రోగులకు భరోసా ఇవ్వడంతో పాటు వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నామన్నారు సినీనటుడు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ. శనివారం హాస్పటల్ లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన 14 బెడ్స్‌ను ఆయన ప్రారంభించారు.
★ గతంలో వున్న 7 పడకల స్థానంలో వీటిని ఏర్పాటు చేశారు.
అనంతరం బాలయ్య మాట్లాడతూ..
★ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశించిన విధంగా పేద ప్రజలకు తక్కువ ధరలో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
★ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రేడియేషన్ యంత్రం, రెండవ పెట్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని కూడా పేషెంట్లకు అందుబాటులోకి తీసుకొస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు.
★ హాస్పిటల్ కు వచ్చే రోగులకు స్వాంతన కలిగించడానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
★ వాటికి గుర్తింపుగా సంస్థ ఎన్నో అవార్డులు అందుతున్నాయని బాలయ్య తెలిపారు.
★ నానాటికీ పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారి నివారణకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక పరిశోధనా విభాగం కూడా ఏర్పాటు చేశామని బాలకృష్ణ చెప్పారు.
★ దీంతో పాటూ రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కలిగించడానికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు, స్క్రీనింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు.
★ ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్దికి పాటుపడిన సిబ్బంది, యాజమాన్యంతో పాటూ నిధులు అందిస్తున్న పలువురు దాతలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
★ అంతకు ముందు తెలుగు ప్రజలకు, అభిమానులకు బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
★ అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ ను కట్ చేశారు.
★ వేడుకలలో భాగంగా సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను బాలయ్య వీక్షించారు.