Latest Posts

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్, డోలు హన్మంతులు అరెస్టు

 

అయ్యప్పస్వామిపై అనుచిత
వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్, డోలు హన్మంతులను 24 గంటలలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు.

ఈనెల 19 వ తారీఖున కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో జరిగిన మీటింగ్ లో అయ్యప్పస్వామి పుట్టుకపై అనుచిత వాఖ్యలు చేసిన బైరి నరేశ్, డోలు హన్మంతులపై కొడంగల్ పోలీస్ స్టేషన్ లో Cr. No. 185/2022 U/S. 153(A), 295(A), 298, 505 (2) IPC లో కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు పంపడమైనది.అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు సబబు కాదు, చట్ట వ్యతిరేకం. ఎవరైనా ఇతరుల మనోభావాలకు, విశ్వాసాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా లేదా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కసిన చర్యలు తీసుకొంటాము. మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు, ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామ్య లౌకిక దేశం.భైరి నరేశ్ ఇంతకుముందు కూడా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ PSలో Cr. No. 47/2022 U/s.153(A), 298,504r/w34 IPCలో మరియు కరీంనగర్ జిల్లా జమ్మికుంట PS లో Cr. No. 338/2012, U/s 427,435,504 r/w 34 IPC  మొదలగు కేసులు నమోదు అయ్యాయి.

Latest Posts

Don't Miss