ఎన్నారై డెస్క్ పరిగణనల ప్రకారం అగ్రరాజ్యం అమెరికాకు (America) భారత్ నుంచి అక్రమ వలసలు (Illegal Immigration) భారీగా పెరిగినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి.యూఎస్ సర్కార్ డేటా ప్రకారం కేవలం ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ రెండు నెలల్లోనే ఆ దేశ బార్డర్ సెక్యూరిటీ అధికారులు ఏకంగా 4,297 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఈ ఏడాది మొత్తం ఇప్పటివరకు 63,927 మంది ఇలా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు.గతేడాది ఈ సంఖ్య 30,662గా ఉందని డేటా చెబుతోంది.అంటే ఏడాది వ్యవధిలో రెట్టింపు అయింది.ఇక 2019-20లో ఈ సంఖ్య కేవలం 19,883 మాత్రమే.గడిచిన రెండేళ్ల నుంచి భారీ సంఖ్యలో భారతీయులు ఇలా అక్రమమార్గంలో అగ్రరాజ్యం వెళ్తున్నారని ఈ డేటా చూస్తే అర్థమవుతోంది.