Latest Posts

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే వైసిపి లక్ష్యం-మారుఫ్ ఆసియా

  • ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే వైసిపి లక్ష్యం
  • ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారుఫ్ ఆసియా.
  • శుక్రవారం పట్టణంలోని ఉర్దూ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ.

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడం వైసిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారు ఫ్ ఆసియా పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ట్యాబుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారి చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందని తెలియజేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబుల పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేటి భావితరాల విద్యార్థుల జీవితాలనుతీర్చిదిద్దే విధంగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని తెలియజేశారు.పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో కల్పించేందుకు నాడు నేడు పనులతో నూతన ఆధునీకరణ పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా వైసిపి ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు వరాల మాలిక్ విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే వైసిపి లక్ష్యం-మారుఫ్ ఆసియా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే వైసిపి లక్ష్యం-మారుఫ్ ఆసియా

Latest Posts

Don't Miss