Latest Posts

ట్రాప్ ద్వారా ముసుగులొకి దింపి ఆ తర్వాత బ్లాక్ మెయిల్

 

యువత ను ట్రాప్ చేసి ఆపై బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ :

అర్దికంగా పరవాలేదు అనుకోనే యువకులకు వలవేస్తుంది… తియ్యగా మాట్లాడుతుంది.. ఆపై ఫోన్ నెంబర్ తీసుకోని మాటలు కలిపి యువకులకు నగ్న విడియోలు పంపుతుంది..ఆతరువాత ముగ్గులోకి దించుతుంది… అప్పటికి లోంగక పోతే.. బెదిరింపు లకు గురి చేస్తుంది… ఫోన్ లలో మాట్లాడిన మాటలు రికార్డు చేసి తల్లిదండ్రులకు యువకుల ప్రెండ్స్ కు చూపించి అల్లరి చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆ మాయలేడి..అప్పటికి లోంగకపోతే పోలిస్ కేసు కూడ పెడుతుంది… కేసు వితుడ్రా చేసుకోవాలంటే లక్షలాది రూపాయాలు కావాలని డిమాండ్ చేస్తుంది.‌..ఈ మహిళ బారిన పడిన ఓ యువకుడు అతని కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో ఏలూరు 3టౌన్ పోలిసులు విచారణ జరిపి పద్మావతి అనే మహిళ పై 384,389,506,109, IPC67A 2000-2008 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు… కొయ్యలగూడెం మండలం వేదాంత పురం కు చెందిన చరమల్ల పద్మావతి 50 సంవత్సరాలు _w/o రాంబాబు గత కొన్ని సంవత్సరాలుగా భర్తకు పిల్లలకు అమె ప్రవర్తన నచ్చక వారు అమెను వదిలి విడిగా ఉంటున్నారు,దీనితో  పద్మావతి యువత కు గాలం వేయడం ఆతరువాత బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం చేస్తుంది… ఈ క్రమంలో దెందులూరు మండలం కు చెందిన ఓ యువకుడిని ట్రాప్ చేసి ఆతరువాత రకరకాలుగా వేదించి డబ్బులు గుంజడం చేస్తుంది అడిగిన డబ్బులు ఆ యువకుడు ఇవ్వక పోవడంతో ఆ యువకుడి తండ్రికి తనతో అతని కొడుకు చనువుగా ఉన్నాడని ఈ విషయం అల్లరి చేయ కుండా ఉండాలంటే లక్ష రూపాయాలు కావాలని డిమాండ్ చేసింది.‌‌.. ఎక్కడ తమ పరువు పోతుందెమో నని ఆ మహిళకు అడిగిన డబ్బులు ఇచ్చారు… అతరువాత మళ్ళి తనకు డబ్బులు అవసరం అని ఆయువకుడి కుటుంబ సభ్యులను అడిగింది వారు తాము ఇవ్వమని తెలపడంతో పోలిస్ కేసు పెట్టింది.. విచారణ జరిపిన ఏలూరు త్రిటౌన్ పోలిసులు మహిళ వ్యవహరించిన తీరు… బాధిత యువకుడి పేరుమీద నకీలి పేస్ బుక్ ఆకౌంట్ క్రియేట్ చేసి ఆయువకుడు నే వేదించినట్లు పోలిసులు గుర్తించారు‌‌. ఆయువకుడి సోదరి గురించి కూడా అసత్య ప్రచారం చేయడంతో భాధిత యువకుడి అక్క పోలిసులను ఆశ్రయించింది..
దింతో పద్మావతి బండారం బయట పడింది.వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలిసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు..

Latest Posts

Don't Miss