Latest Posts

గుంటూరులో ముస్లిం మైనారిటీస్ మహిళా కార్యాలయం ప్రారంభం

 

గుంటూరు జిల్లా రామ్ రెడ్డి నగర్ ప్రతిమ హాస్పిటల్ ప్రక్కనగల రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బిసి ముస్లిం మైనారిటీస్ మహిళా కార్యాలయం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చుక్కా.రాణి రాష్ట్ర బీసీ నాయకురాలు గుంటుపల్లి.భ్రమరాంబ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాన్ని రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవ. నాగ జగన్ బాబురావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి బాబురావు మాట్లాడుతూ కులా మత బేధం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్  ఆశయాలతో ముందుకు వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ,ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ వారికి ఏ అన్యాయం జరిగిన న్యాయబద్ధంగా పోరాడాలని మహిళలకు బాబూరావు సూచించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మాదిగ దండోరు ఉపాధ్యక్షుడు ఏసుపోగు. దానియేలు,జర్రిపోతుల. సంతోషిమాత,చల్ల. కుమరి,జ్యోతి,అందుగల. ప్రతాప్ కుమార్,షేక్. గాలిబా, మహిత. అందుగల, రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొనడం జరిగింది. అనంతరం భారీగా విందు కార్యక్రమం జరిగింది.

Latest Posts

Don't Miss