Latest Posts

వైఎస్ఆర్ భీమా అందజేసిన తాండ్ర సాంబశివరావు

 

వైఎస్ఆర్ భీమా అందజేత బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతు వారి పాలెం గ్రామం కస్తూరిబాయి నగర్ కు చెందిన ఎద్దు సోమెలు  కుమారుడు ఎద్దు రాజేష్ అకాల మరణం చెందగా, వైఎస్ఆర్ భీమా కింద మంజూరు కాబడిన లక్ష రూపాయలకుగాను ముందుగా మట్టి ఖర్చుల నిమిత్తం ఈరోజు పది వేల రూపాయలు స్వర్గీయ ఎద్దు రాజేష్ భార్య ధనలక్ష్మి కి అందజేస్తున్న నల్లమోతు వారి పాలెం ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ఎవరికి ఎప్పుడు ఏమి జరిగిద్దో తెలియదు కనుక ప్రతి ఒక్కరూ భీమా చేపించుకోవటం చాలా అవసరం అని తెలియ జేసీ ఎద్దు రాజేష్ కుటుంబ సభ్యులకు బాపట్ల నియోజకవర్గ వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తమ గ్రామానికి చెందిన ఎద్దు రాజేష్ అకాల మరణం చెందిన వెంటనే లక్ష రూపాయలు భీమా కింద మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియ జేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కుంటా రత్న బాబు, వైసీపీ నాయకులు సూరగాని దుర్గా ప్రసాద్, జీలపెగు తిరుపతయ్య, దాసరి రాజు, మాణిక్యమ్మ,ఎద్దు సోమేలు దంపతులు, జిలపెగు మరియాదాసు, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ లు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss