Latest Posts

ప్రభుత్వపరంగా చేదోడు వాదోడుగా నిలవనున్న గ్రామ సచివాలయ కన్వీనర్లు-దూలం నాగేశ్వరరావు

 

ప్రభుత్వపరంగా ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామ వాలంటీర్లకు అనుసంధానంగా ఇప్పుడు నియమించబడిన గ్రామ సచివాలయ కన్వీనర్లు చేదోడు వాదోడుగా ఉంటారని..ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో ముందుకు సాగాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) అన్నారు.ఈ ఉదయం ముదినేపల్లి మండల పరిధిలోని గ్రామ వాలంటీర్లతో సింగరాయపాలెంలో ఆయన ఆత్మీయంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ జగనన్న సైనికులుగా పిలవబడుతున్న గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో నూటికి నూరు శాతం కృషి చేస్తూ… ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని… వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల ఎంపికలో తలెత్తుతున్న చిన్నాచితక సమస్యలను పరిష్కరించడంలో గ్రామ సచివాలయ కన్వీనర్లు మీకు అండదండగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. జగనన్న ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్ పింఛను కానుకను పెంచుతూ జనవరి మూడో తేదీ నుండి 9వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించబోతున్నామని… అందులో భాగంగా ముదినేపల్లి మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి ఆరవ తేదీ ఉదయం 9 గంటలకు ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు చేసి అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామ వాలంటీర్లంతా ఆరోజు కొత్త లబ్ధిదారులను తీసుకుని కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. అలాగే జగనన్న నిర్ణయం మేరకు జనవరి 6వ తేదీ నుండి మీకు అనుసంధానంగా ఒక్కో గ్రామ వాలంటీర్ పరిధిలోని ఇళ్ళ నుండి ఒక మహిళను ఒక ఒక పురుషుని గృహసారథులుగా సచివాలయ కన్వీనర్లతో కలిసి ఎంపిక చేయాలని డిఎన్ఆర్ తెలిపారు. నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా విచ్చేసిన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మాదు శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రతి గ్రామ సచివాలయానికి ఒక మహిళ ఇద్దరు పురుషుల చొప్పున సచివాలయ కన్వీనర్లను ఎంపిక చేయడం జరిగిందని …గ్రామ వాలంటీర్లు ఇంతకుముందు పనిచేసిన విధానం గానే ఇకముందు కూడా పని చేసుకుంటూ వెళుతూ… గ్రామ సచివాలయ కన్వీనర్ లను సమన్వయం చేసుకుంటూ… గృహసారధులను ప్రతి ఇంటికి చేరువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య, వైస్ ఎంపీపీ రాచూరి రాధా, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కరేటి గోవిందరాజులు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శీలం రామకృష్ణ, మండల వైకాపా అధ్యక్షులు మోట్రు ఏసుబాబు, మాజీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు,మండల వైకాపా మహిళా విభాగం అధ్యక్షురాలు గుగ్గర శ్రావణి, శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహమణ్యేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ శొంఠి నాగరాజు,ఎంపీటీసీ సభ్యులు మరీదు నాగయ్య, దూసనపూడి లక్ష్మీ కుమారి,కోటే ప్రవీణ్, నాయకులు కోమటి విష్ణువర్ధన్, గూడపాటి వరప్రసాద్, దాకారపు శ్రీనివాసరావు, జాస్తి రాజేంద్రప్రసాద్, బోయిన రామరాజు,నర్రావెంకటేశ్వరరావు,సాక్షి సాయిబాబా,యర్రంశెట్టి చిరంజీవి, వివిధ గ్రామ సచివాలయాల కన్వీనర్లు, ఎంపీడీఓ మల్లీశ్వరి,పంచాయితీ కార్యదర్సులు శ్యామ్ ప్రసాద్, రమేష్,నాగలక్ష్మి, గిరిజ, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss