Latest Posts

 ప్రధాని నరేంద్ర మోదీ తల్లి కన్నుమూత

 

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. 100 ఏళ్ల వయసున్న ఆమె వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాసకోస ఇబ్బందులతో మూడు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రధాని మోదీ తన తల్లిని తలచుకుంటూ ట్వీట్ చేశారు. 100 ఏళ్ల పాటు జీవించిన తన తల్లి.. ఇప్పుడు దేవుడి పాదాల చెంత విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుబడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలను అమ్మలో ఉన్నాయని అన్నారు. తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా కలిసినప్పుడు.. ఆమె తనతో చెప్పిన ఓ మాటను ఆయన గుర్తు చేసుకున్నారు. ” బుద్ధితో పనిచేయాలి. శుద్ధిగా జీవించాలి.” అని తనకు చెప్పారని.. ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.హీరాబెన్ 1923లో జన్మించారు.హీరాబెన్‌కు మొత్తం ఆరుగురు సంతానం. గుజరాత్‌లోని గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ఆమె నివసిస్తున్నారు. నరేంద్ర మోదీ సోదరుడు పంకజ్‌ మోదీ తన తల్లితో పాటు రైసన్‌లో నివసిస్తున్నారు.

Latest Posts

Don't Miss