Latest Posts

దివ్యాంగులకు విశాఖ శారదాపీఠం సేవలు

 

దివ్యాంగులకు విశాఖ శారదాపీఠం సేవలు :

విశాఖ జిల్లాలోని భవిత స్కూల్స్ లో ఉన్న దివ్యాంగులకు విశాఖ శ్రీ శారదాపీఠం బృహత్తరమైన సేవా కార్యక్రమాలను చేపట్టింది. గురుదేవా ఛారిటబుల్ ట్రస్టుతో కలిసి ఉచితంగా పోలియో కాలిపర్స్ ను అందించనుంది. ఈమేరకు చినముషిడివాడలోని పోర్టు కళ్యాణమండపంలో వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రారంభించారు. దివ్యాంగులకు పోషక విలువలతో కూడిన మందులను పంపిణీ చేసారు. అవసరమైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందజేసేందుకు ఈ శిబిరం ద్వారా కొలతలు తీసుకున్నారు. ఫిజియోథెరపిస్టుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం కృత్రిమ అవయవాలను అందజేస్తామని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ జిల్లా పరిధిలోని చినగదిలి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెదగంట్యాడ, గాజువాక, పెందుర్తి, విశాఖ అర్బన్ ప్రాంతాల్లోని భవిత సెంటర్స్ దివ్యాంగులకు ఈ సేవలు అందుతాయని వివరించారు. ఈ శిబిరాన్ని గురుదేవా ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు జగదీష్ బాబు పర్యవేక్షించారు

Latest Posts

Don't Miss