Latest Posts

కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ ల కు న్యాయంచేయండి- APUWJ, APEMJA

 

కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ ల కు న్యాయంచేయండి- APUWJ, APEMJA నేతలు …
గతసంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ లకు 5,00, 000 రూపాయల వంతున ఆర్థికసహాయం చేయునున్నట్లు జీవో No 154 ను విడుదల చేసింది.జీవో విడుదలై సంవత్సరం గడిచిపోయినా నేటికీ అమలు కాని సంగతి తెలిసినదే.జీఓ అమలుచేసి బాధితులకు న్యాయం చేసేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు బాధితులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దానిపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.154 జీవో ప్రకారం కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి ఆర్థికసహాయం చేయాలంటూ దరఖాస్తుదారులు చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకావాలని , దానిపై తగినచర్యలు తీసుకోని,తక్షణమే చెల్లిలింపులు జరపాలని న్యాయస్థానం ఆదేశించింది.తదుపరి విచారణ సంక్రాంతి సెలవుల అనంతరం చేపడతామని కోర్టు పేర్కొన్నది.న్యాయస్థానం జారీచేసిన ఆదేశాలను ఈరోజు రాష్ట్ర సమాచారశాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి గారికి అందచేసి బాధితులకు న్యాయం చేయాలని యూనియన్ తరపున కోరడం జరిగింది.జే.డి. గారిని కలిసిన వారిలో బాధిత కుటుంబసభ్యులు, AP ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రఅధ్యక్షులు యేచూరి శివ IJU సభ్యులు ఓ. మార్కండేయులు , ఉమ్మడి గుంటూరుజిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కె,సునీల్ సందీప్ ఉన్నారు.ఈ సందర్భంగా JD కస్తూరి మాట్లాడుతూ న్యాయస్థాన ఆదేశాలను ప్రభుత్యం దృష్టికి తీసుకువెళతామన్నారు.బాధితకుటుంబాలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీఇచ్చారు.

Latest Posts

Don't Miss