హైవే పై విమానాలు.. నేడు ట్రయల్ రన్
బాపట్ల జిల్లా కొరిశపాడు – రేణింగవరంలో మధ్య జాతీయ రహదారిపై నిర్మించిన అత్యవసర రన్‌వేపై ఇవాళ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. నాలుగు ఫైటర్ జెట్ విమానాలు, ఒక రవాణా విమానం రన్‌వే మీద ల్యాండింగ్, టేకాఫ్ కానున్నాయి. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్‌వేలను ఏర్పాటు చేశారు.