సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.25 గంటలకు నర్సీపట్నం మండలం బలిఘట్టం చేరుకుంటారు. 11.15 – 12.50 జోగునాథునిపాలెం వద్ద నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. తాండవ –ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
కార్యక్రమం అనంతరం 1.25 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 3.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.