Latest Posts

విద్యార్ధిని విద్యార్ధులకు బైజ్యూస్ ట్యాబ్స్ పంపిణీ చేసిన శెట్టిపల్లె రఘురామి రెడ్డి

విద్యార్థులకు బైజ్యూస్ ట్యాబ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామి రెడ్డి

కడప జిల్లా దువ్వూరు మండలం పుల్లారెడ్డి పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని విద్యార్ధులకు బైజ్యూస్ కంటెంట్ తో కూడిన అధునాతన ట్యాబ్స్ ను ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైజ్యూస్ లెర్నింగ్ యాప్ తో ఎనిమిది భాషల్లో ఎనిమిదో తరగతి విద్యార్థుల కు ఉచితంగా ట్యాబ్స్ అందజేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో 8 నుండి 12 వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని విద్యార్థులు, తల్లిదండ్రులు మనస్సుతో దీవించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమ కుమారి, మండల అభివృద్ధి అధికారి జగదీశ్వర్ రెడ్డి, ఎంఈఓ శివ జ్యోతి, ప్రధానోపాధ్యాయులు అహల్య భాయ్,ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి,జెట్పీటీసీ కృష్ణయ్య మరియు ఉపాధ్యాయులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss