Latest Posts

రోడ్డు పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనంత

రాం నగర్ లో గల నారాయణ స్కూల్ రోడ్డు నందు రూ.38 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు స్థానిక కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేసారు.అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు అయి మన అనంత ను సుందర అనంత గా తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం సలీమ్,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి,కమిషనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss