బ్రహ్మం సాగర్ లో ఈరోజు గురువారం బ్రహ్మం సాగర్ వెనుక జలాల్లో రేఖలకుంట పరిధిలో 13 లక్షల చేప పిల్లలు నీటిలో వదిలేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభిస్తున్నప్పటికీ బ్రహ్మ సాగర్ చుట్టుప్రక్కల ఉన్న మత్స్యకారులకు లైసెన్స్ దారులకు, పత్రిక విలేకరులకు అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేప పిల్లలను వదలడంలో మర్మమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు .. ప్రతి సంవత్సరం చేప పిల్లలు బ్రహ్మసాగర్ లో అధికారులు వదులుతున్నారన్నది పేపర్లకే పరిమితం ఆచరణలో లేదని మత్స్యకారులు అంటున్నారు….ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఎఫ్డిఓను వివరణ కొరకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మత్స్యకారుల జీవనోపాధి కోసం చాప పిల్లలను బ్రహ్మం సాగర్ లో ప్రతి సంవత్సరం వదులుతున్నాం అంటున్నారు కానీ ఆ విషయం మాకే తెలుపకపోవడం చాలా బాధాకరమని మత్స్యకారులు వాపోతున్నారు….