Latest Posts

బీజేపీ కి వైసీపీ తో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు – బీజేపీ జాతీయ కార్యదర్శి

బీజేపీ, ఏపీ లో వైసీపీ లో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు
సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి…

దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ లో వైసీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి అమర్ కి సందులు గొందులు మీద ఉన్న అవగాహన, తన శాఖలపైన లేదన్నారు.దావోస్ కి బ్యాండ్ మేళం లాగా అంత మంది వెళ్లి ఎంత పెట్టుబడి తెచ్చారో చెప్పాలని నిలదీశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు రేషన్ బియ్యాన్ని అందించడాన్ని ఇంకో సంవత్సరం పొడిగించారని ఆనందం వ్యక్తం చేశారు.ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే తట్టి, కొట్టమని అధికారులకు సీఎం చెపుతున్నారని ఆరోపించారు.గతంలో పోలవరం డిపిఆర్ పైన అనేక ఆరోపణలు చేసిన వైసీపీ, మళ్ళీ అదే డిపిఆర్ ని కేంద్రానికి సబ్మిట్ చేస్తుందని తెలిపారు. 85 టీఎంసీ నీరు ఇస్తానని, ఇవ్వకుండా సీఎం విశాఖ వాసులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2015లో కేంద్రానికి మెట్రో డిపిఆర్ అప్పటి ప్రభుత్వం పంపించిందని, 2017 లో రివైజ్డ్ పంపాలి అని కేంద్రం చెపితే, ఇప్పటి వరకూ పంపలేదని, ప్రధాని దగ్గర డిపిఆర్ పంపామని అబద్ధం చెపుతున్నారని ఆయన మండిపడ్డారు. 2019 డిసెంబర్ 19న ఎన్ఎండిసితో అవగాహన చేసుకుని, డిసెంబర్ 23న కడప స్టీల్ ప్లంట్ కి భూమి పూజ చేశారన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డిసెంబర్ 23 కడప వెళ్లి స్టీల్ ప్లాంట్ కడతానని ముఖ్యమంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు.ఒక్కో కాలేజ్ కి కేంద్రం రూ.195 కోట్లు ఇస్తే, ఒక్క చిన్న పని చేయకుండా మళ్ళీ కేంద్రాన్ని మరికొన్ని కాలేజ్ లు కావాలని అడుగుతున్నారని తెలిపారు.గత 2 సంవత్సరాల్లో 2 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇస్తే ప్రజలకు చేరింది, కేవలం 20 శాతం మాత్రమే అన్నారు. సిగ్గు లేకుండా 1.75 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని సీఎం జగన్ చెపుతున్నారని మండి పడ్డారు.గ్లోబల్ టెక్ సమ్మిట్ చేయడం సంతోషమని, కానీ ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు అనుమానంగా ఉందన్నారు.మంత్రి అమర్ తన శాఖల మీద మాట్లాడటం కన్నా, రాజకీయాలపై మాట్లాడతానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని చెప్పారు.ఇన్ఫోసిస్ వస్తుంది అన్నారని, 4 నెలలు గడిచిన ఇంకా ఇన్ఫోసిస్ విశాఖకు రాలేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు http://www.pmkvyofficial.org/ పెడుతుంటే, సీఎం జగన్ మాత్రం తిట్లకు సెంటర్లు పెడుతున్నారని తెలిపారు.స్మార్ట్ మీటర్లకు బిగించుకోవాలి అంటే రూ.1350 రూపాయలు కేంద్ర ఇస్తుందని వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బిజెపి జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss