ప్రజల మౌలిక అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్)అన్నారు. ఈ ఉదయం కలిదిండి ఇందిరానగర్ లో మండల పరిషత్ నిధులనుండి నాలుగు లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించబోయే సి సి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు బొర్రా సత్యవతి, గ్రామ సర్పంచ్ మసిముక్కు మారుతీ ప్రసన్న,ఎంపీటీసీ సభ్యులు నీలి సుమన్,ఉపసర్పంచ్ ముత్తిరెడ్డి సత్యనారాయణ, నాయకులు చాంద్ బాషా, పోతురాజు లక్ష్మణరావు, పెరుమాళ్ళ భోగేశ్వర రావు, ముద్దం గాంధీ, గుడివాడ ఫణికుమార్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


