Latest Posts

కోడి పందాలు,పేకాట నిర్వహించినవారిపై కఠిన చర్యలు తప్పవు-ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు

కోడి పందాలు, గుండాట, పేకాట వంటి క్రీడలను నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు హెచ్చరించారు రానున్న ,నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ముగ్గులు పోటీలు కబడ్డీ వాలి బాల్ వంటి క్రీడల ను నిర్వహించకొని మీ యొక్క ఫ్యామిలీ తో సంతోషంగా గడపాలని ఆయన అన్నారు ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ప్రజలు ఎవరైన ఇల్లు విడిచి వారి యొక్క బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లేలా ఉంటే పండుగలను పురస్కరించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు వారి యొక్క ఇంటి భద్రత దృష్ట్యా గృహాలకు అన్ని వైపులా తాళాలు వేసుకోని విలువైన ఆభరణాలు జాగ్రత్త పరుచుకోవాలని ఆయన తెలియజేశారు ఊరి ప్రయాణం చేసేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ యొక్క వస్తువులు భద్రపరుచుకోవాలని ఆయన అన్నారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100 కి డయల్ చేస్తే తక్షణమే పోలీసు వారు మీకు అందుబాటులో ఉంటారని సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు అన్నారు

Latest Posts

Don't Miss