కందుకూరు అపశ్రుతి ఘటనకు కారకులెవరు
- సభలు, సమావేశాలు నిర్వహణకు ఎన్నికల సంఘం శాస్త్రీయ పరమైన నిరంతర పర్యవేక్షణ లేకపోవడం కాదా !
- ఈ సభలు, సమావేశాలకు ప్రజలు స్వచ్చందంగా వసున్నారా ! లేదే వారి పేదరికాన్ని హేళన చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు జే జే లు కొట్టించుకోవటం కాదా !
- కందుకూరు విషాద ఘటనను కూడా రాజకీయం చేద్దాం అనుకుంటున్న ప్రధాన రాజకీయ పక్షాల్లో మార్పు రాదా !
- చంద్రబాబు, జగన్, పవన్ సభల్లో ఈలలు వేసే వారు ముగ్గురునిర్వహిస్తున్న సభల్లో ప్రత్యక్షమవ్వటం నిజం కాదా !
- ప్రధాన రాజకీయ పార్టిలు నిర్వహించే సభలు సమావేశాలు విజయవంతం అని ప్రచారం కల్పిసున్న మీడియా వార్తల్లో నిజమెంత !
- ఆంధ్రప్రదేశ్ లో కరువు, పేదరికం, హక్కులు ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుండగా సభలు, సమావేశాలు స్వచ్చందంగా ఎలా విజయవంతం అవుతాయా !
- ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడవల్సిన పోలీస్ ను టిడిపి, వైసిపి పోలీస్ గా విభజిస్తు పాలించటం నిజం కదా !
- వీరి సభలు, సమావేశాలు కేవలం మీడియా పరంగానే విజయవంతం అనిపించుకోవటం నిజం కాదా !
- వారసత్వ రాజకీయాలతో సామాజిక వ్యవస్థను కలుషితం చేస్తు ఖరీదైన జీవితాలను అనుభవిస్తుండటం వాస్తవం కాదా ! వీరికి ఆత్మ సాక్షి వుందా !
- నేటి పాలనతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారా ! ఆనాటి బ్రిటిష్ పాలనే మేలు అనుకుంటున్నారా !
కందుకూరు విషాద ఘటనకు రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ పార్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.