Latest Posts

ఏపీకి పరిశ్రమల వెల్లువ

2022లో ఏపీకి పరిశ్రమల వెల్లువ
1) పెట్టుబడుల్లో ఏపీ ఫస్ట్‌
9 నెలల్లో(2022 జనవరి సెప్టెంబర్ ) 44,286 కోట్ల పెట్టుబడులు సాకారం
దేశవ్యాప్తంగా వచ్చిన వాటిల్లో 22 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే
-కేంద్ర సంస్థ DPIIT)

2) 1,66,920 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం
దావోస్‌లో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు

    • గ్రాసిం క్లోర్‌ ఆల్కాలిక్, నోవా ఎయిర్, ఐటీసీ స్పైసెస్‌పార్క్, ఐటీసీ వెల్కం హోటల్‌ ప్రారంభం
    • టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్‌టెక్, డిక్సన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ యూనిట్ల ప్రారంభం
    • రామాయపట్నంపోర్టు, అపాచీ ఫుట్‌వేర్‌ పార్క్, అస్సాగో బయో ఇథనాల్‌ వంటి పలు యూనిట్లకు శంకుస్థాపన
    • అనంతపురం, విశాఖల్లో రెండు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి ఒప్పందం
    • టాటా, బిర్లా, ఐటీసీ, నాల్కో, ఎన్‌టీపీసీ, మిథాని, టెక్‌ మహీంద్రా వంటి దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాయి.
    • సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఈ ఏడాది నాలుగుసార్లు సమావేశమై రూ.1,66,919.71 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
    • ఇందులో రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ సోలార్‌ రూ.43,143 కోట్లతో సోలార్‌ ప్యానల్స్‌ తయారీ, కాకినాడ సెజ్‌లో రూ.1,900 కోట్లతో లైఫిజ్‌ ఫార్మా యూనిట్, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో రూ.386.23 కోట్లతో కాసిస్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్, రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఫ్యాక్టరీ, రూ.560 కోట్లతో నెల్లూరులో క్రిభ్‌కో బయో ఇథనాల్, రాష్ట్రంలో వివిధ చోట్ల అదానీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్స్‌ వంటివి ఉన్నాయి.
    • ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిం ఇండస్ట్రీస్‌ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేసిన క్లోర్‌ ఆల్కాలిక్‌ (కాస్టిక్‌ సోడా) తయారీ యూనిట్‌ను కుమారమంగళం బిర్లాతో కలిసి ముఖ్యమంత్రి ఏప్రిల్‌ 21న ప్రారంభించారు.
    • జనవరి 12న గుంటూరులో ఐటీసీ వెల్‌కమ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్, నవంబర్‌ 11న ఐటీసీకి చెందిన స్పైసెస్‌ పార్కును సీఎం ప్రారంభించారు. జూన్‌ 23న తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్, సన్నీఆప్‌టెక్, డిక్సన్‌ వంటి కంపెనీలను సీఎం ప్రారంభించడం ద్వారా వేలాదిమందికి ఉపాధి కల్పించారు.
    • ఆగస్టు 16న జపాన్‌ టైర్ల దిగ్గజ సంస్థ యకహోమా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.2,200 కోట్ల­తో ఏర్పాటు చేసిన హాఫ్‌ హైవే టైర్ల తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు.

    Latest Posts

    Don't Miss