Latest Posts

విద్యార్థి, విద్యార్థినిలకు ట్యాబ్ లను పంపిణీ కార్యక్రమం చేపట్టిన కాటసాని రామిరెడ్డి

    • ఎనిమిదవ తరగతి విద్యార్థి, విద్యార్థినిలకు 1,079 ట్యాబ్ లను పంపిణీ కార్యక్రమం చేసిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు….
    • రేపటి భవిష్యత్ కు పునాదులు నేటి విద్యార్థులే……
    • విద్యార్థుల్లో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం వైయస్ జగన్ గారు…..
    • బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకొన్న వైయస్సార్ ప్రభుత్వం…

    బనగానపల్లె నియోజకవర్గం లోని సంజామల మండలం,కోవెలకుంట్ల మండలం లోని 1,079 మంది ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ లను బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి పంపిణీ కార్యక్రమం చేపట్టారు.అనంతరం మండల విద్యాశాఖ వారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ కేవలం ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే చదివే కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా జగనన్న ప్రభుత్వం లో ప్రభుత్వ స్కూల్ లల్లో ఆధునిక మౌలిక వసతులతో పాటు అధునాతన విద్యావిధానం ను ప్రవేశ పెట్టడం జరిగింది అని అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లకు ,ఎయిడెడ్ స్కూల్ లలో చదివే ఎనిమిదవ తరగతి విద్యార్థులందరికీ 15,000 వేలు విలువ చేసే ట్యాబ్ లతో పాటుగా బైజుస్ అప్ ను కూడా సంవత్సరం పాటు ఉచితంగా అందించడం జరుగుతుంది అని చెప్పారు.కాబట్టి విద్యార్థుల మీద ఎన్నో ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతున్న ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నమ్మకాన్ని వమ్ముచేయకుండ చూడాల్సిన ,చదవాల్సిన బాధ్యత మీ అందరి మీదా వుంది అని చెప్పారు.ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్రా గిరిజా రెడ్డి,వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, సంజామల మండల పరిషత్ ఉపాధ్యక్షులు చిన్న బాబు,కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బీవీ నాగార్జున రెడ్డి, పెండేకంటి కిరణ్ కుమార్,కోవెలకుంట్ల మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ భీమ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి, సంజామల మండల విద్యాశాఖాదికారులు, సంజామల ఎంపిడిఓ విజయ్ కుమార్,కోవెలకుంట్ల మండల అభివృద్ధి అధికారి మహమ్మద్ దౌలా,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

    Latest Posts

    Don't Miss