Latest Posts

రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నెల్లూరు సిటీ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆ జిల్లాది విశిష్ట స్థానం.. అలాంటి చోట జిల్లా కేంద్రం అంటే పొలిటికల్‌గా ఎంతో ఫోకస్ ఉంటూ వస్తుంది… అదే నెల్లూరు జిల్లా… ఇప్పుడందరి దృష్టిని నెల్లూరు సిటీ పాలిటిక్స్ ఆకర్షిస్తున్నాయి.. ఒకరికి నలుగురు ప్రముఖులు అక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉండటానికి చేసుకుంటున్న ప్రయత్నాలతో సింహపురి రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది… అసలు నెల్లూరు సిటీ సీటుపై అంత క్రేజ్ ఎందుకో?.. అక్కడేం జరుగుతుందో లెటజ్ వాచ్

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జిల్లా కేంద్రమైన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది … సిటీలో ఎమ్మెల్యేగా గెలుపొందితే జిల్లాలో మంచి గుర్తింపు ఉంటుందని నేతలు భావిస్తారు … అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు మంత్రులుగా కూడా పని చేశారు …. అందుకే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేసేందుకు బడా నేతలు క్యూ కడుతున్నారంట….

నెల్లూరు సిటీ సీటు ఆశిస్తున్న వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి సిటీ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం… టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలో ఉంటారని తెలుస్తోంది… సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్నారు… అయితే సీఎం జగన్ ఆయనకు సిటీ టికెట్ కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది.

2024 ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తే గెలుపు టీడీపీదేనన్న అభిప్రాయం ఉంది… నియోజకవర్గంలో నారాయణ అభివృద్ధి చేసినంతగా వైసీపీ హయాంలో అనిల్ అభివృద్ధి పనులు చేయలేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా టీడీపీ హయాంలో అత్యధికంగా టిడ్కో ఇళ్లను మంజూరు చేయించారాయన…. వాటి నిర్మాణం దాదాపు పూర్తయింది… సిటీ పరిధిలోని పార్కులను అభివృద్ధి పరిచారు…. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అనిల్‌పై స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. చివరి నిమిషంలో కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడంతో నారాయణకు ఓటమి తప్పలేదంటారు.

నారాయణ ఓడిపోయిన తర్వాత నగర నియోజవకర్గాన్ని పట్టించుకోలేదు… కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు …. కార్యకర్తల కష్టసుఖాలు తెలియని నారాయణ పోటీ చేసి గెలిస్తే తమకు నష్టమే తప్ప లాభం లేదని పార్టీ క్యాడర్ భావిస్తోందన్న భావన మరోవైపు ఉంది… పార్టీ కోసం ఇంత కష్టపడుతున్న తమకు నారాయణ న్యాయం చేయలేరని కార్యకర్తలు వాపోతున్నారు … ఒక వేళ క్యాడర్ సహకరించి టీడీపీ నుంచి నారాయణ పోటీ చేస్తే … మాజీ మంత్రి అనిల్‌పై తిరుగులేని విజయం సాధిస్తారని రాజకీయ విక్షేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వెంటకగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు… ఆయన నెల్లూరు సిటీ నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు… ప్రస్తుతం నగరంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అనిల్‌ను వెంకటగిరి నియోజకవర్గంలో నుంచి పోటీ చేయిస్తారని, అక్కడ బీసీలు అధికంగా ఉండటంతో వైసీపీ అధిష్ఠానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుందని అంచనా… గతంలో ఆనం కుటుంబం నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు… టీడీపీ నుంచి నారాయణ, వైసీపీ నుంచి ఆనం బరిలోకి దిగితే తీవ్ర పోటీ ఉంటుందంటున్నారు.. అయితే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆనం వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారో చూడాలి…

మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి కూడా నెల్లూరు సిటీ టికెట్ ఆశిస్తున్నారంట… సిటీ వైసీపీ టికెట్ దక్కకపోతే ఆమె కావలి, నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకూ సిద్ధంగా ఉన్నారంట… ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట బరిలోకి దిగుతారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది… నెల్లూరు నగరం నుంచి ఆమెపోటీకి దిగి… టీడీపీ నుంచి నారాయణ బరిలో ఉంటే ప్రశాంతిరెడ్డికి కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది… ప్రశాంతిరెడ్డికి ఆర్థికంగా బలం ఉన్నప్పటికీ ప్రజలతో పెద్దగా పరిచయం లేకపోవడం మైనస్ అవుతుందంటున్నారు.. .. ఏదేమైనా నెల్లూరి సిటీ బిగ్‌షాట్స్ పోటీతో కాస్ట్లీ మారడం ఖాయంగా కనిపిస్తోంది

Latest Posts

Don't Miss