Latest Posts

మెట్రోరైలు ప్రతిపాదనను త్రోసిపుచ్చిన ఏపీ రాష్ట్రప్రభుత్వం

ఏపీకి మెట్రోరైలు అందని ద్రాక్షేనా?.. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు మెట్రో రైలు ప్రతిపాదన ఉంది.. అయితే దానిపై రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని అసలు అడగడమే లేదంటున్నారు… కనీసం ప్రతిపాదనలు కూడా పంపకపోతుండటంతో కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు.. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తప్ప.. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలో మెట్రో రైళ్లు ఉన్నాయి… విశాఖ, విజయవాడలతో దాదాపు సమాన జనాభా ఉన్న.. నగరాలకు ఇప్పటికే మెట్రో అందుబాటులోకి వచ్చింది… ఆ క్రమంలో
ఏపీని వెనుకబడిన రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తప్ప.. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలో మెట్రో రైళ్లు ఉన్నాయి. మన విశాఖ, విజయవాడలతో దాదాపు సమాన జనాభా ఉన్న.. పుణె, నాగ్‌పుర్‌, ఇందోర్‌, భోపాల్‌, కోచి, కాన్పుర్‌ వంటి నగరాలకు ఇప్పటికే మెట్రో అందుబాటులోకి వచ్చింది… శ్రీనగర్‌, జమ్ము, గోరఖ్‌పుర్‌ వంటి తృతీయశ్రేణి, అంతకంటే తక్కువ స్థాయి నగరాలూ మెట్రో ఏర్పాటుకు నడుంకట్టాయి…

కొన్ని రాష్ట్రాల్లో మూడు నాలుగు నగరాల్లో మెట్రో ప్రాజెక్టులున్నాయి … వాటి విస్తరణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి … కొన్ని ప్రాజెక్టుల్ని సొంత నిధులతో, మరికొన్నింటిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్నాయి… 2017 మెట్రో విధానం ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు వ్యయాన్ని సగం సంగం నిష్పత్తిలో భరించేలా కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం కోసం వచ్చిన, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులు 18 వరకు ఉన్నాయి… దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నీ మెట్రో కోసం ఇంతగా తపిస్తుంటే.. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వానికి మాత్రం స్పందనే ఉన్నట్లు కనిపించడం లేదు… విజయవాడ, విశాఖల్లో మెట్రో రైళ్ల ప్రాజెక్టులు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉన్నా కేంద్రాన్ని ఏనాడూ గట్టిగా అడగలేదు… కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు

వైసిపి ప్రభుత్వానికి మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రాధాన్యం, ఆవశ్యకతపై అవగాహన, ఆలోచన ఏ కోశానా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై కేంద్రానికి ప్రతిపాదనే పంపకపోవడం ఇందుకు నిదర్శనం. కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, వాళ్లు ప్రాజెక్టును మంజూరు చేస్తే… రాష్ట్ర వాటాగా 50 శాతం నిధులు ఎక్కడ కట్టాల్సి వస్తుందోనన్న భయంతో తాత్సారం చేస్తోందన్న విమర్శలూ ఉన్నాయి…

దానిపై ఎవరు ఏమంటుకుంటున్నా జగన్ ప్రభుత్వం మాత్రం చలించడం లేదు. మెట్రో రైళ్ల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులతో రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే… ఏపీని వెనుకబడిన రాష్ట్రాలైన ఒడిశా, ఝార్ఖండ్‌, ఈశాన్య రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే అంటున్నారు…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002-03లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనకు బీజం పడింది…. వివిధ కారణాలతో ప్రాజెక్టులో జాప్యం జరిగింది…. పీపీపీ విధానంలో చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్టు 2017 నవంబరు 29న అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడది హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారి జనాల అవసరాలు ఊహించని రీతిలో తీరుస్తోంది…. రెండు దశాబ్దాల క్రితమే.. టిడిపి ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్‌ వచ్చింది. ఇప్పుడు మెట్రో కూడా రావడంతో ప్రజలకు చాలా వెసులుబాటు లభిస్తోంది.

ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి ఆ చివర ఉన్న మియాపూర్‌ నుంచి ఈ శివార్లలో ఉన్న ఎల్బీనగర్‌కు 29 కిలో మీటర్ల దూరం…. బస్సులో వెళ్లాలంటే గంటా ముప్పావు సమయం పడుతుంది. మెట్రోలో 45 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు … హైదరాబాద్‌లో ప్రస్తుతం 72 కి.మీ.ల పొడవైన మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి …. మరో రెండు కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది… రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పొడవునా మెట్రో కారిడార్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. .. ఇవన్నీ చూస్తూ కూడా జగన్ సర్కారు కేంద్రం వద్ద అసలు మెట్రో ప్రస్తావనే తేకపోతుండటంతో అది అందని ద్రాక్షగా మారుతుండటం.. నిజంగా ఏపీ దురదృష్టమే..

Latest Posts

Don't Miss