- బొకేలు,శాలువాలు వద్దు…..
- నోట్ బుక్స్,స్టేషనరీ ఇవ్వండి….
- అంగన్ వాడి పిల్లలకు మ్యాట్ లు ఇవ్వండి.
- మీ గ్రామాల్లో,మీ వార్డుల్లో పాఠశాలలను దత్తత తీసుకోండి.
- వృధా ఖర్చుల స్థానంలో ఒక మంచి పనికి ముందుకు రండి.
- మీరు చేసే చిన్న సహాయం భవిష్యత్తు తరాలకు వెలుగులు నింపేదిగా మారుతుంది…
- రానున్న నూతన సంవత్సరానికి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి….
- ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి.
నూతన సంవత్సరం సందర్భంగా తనను కలువటానికి వచ్చే వారు ఎవరు కూడా బొకేలు,శాలువలు తీసుకురావొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు విజ్ఞప్తి చేసారు.ఇతర నేతలను,అధికారులను కలువటానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాంటి వృధా ఖర్చుల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాటి స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు,బ్యాగులు,వాటర్ బాటిల్స్,పెన్నులు,పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు,చిన్న వాటర్ బాటిళ్లు, ఇతరత్రా వాటిని అందించాలని కోరారు. రానున్న నూతన సంవత్సరము 2023 సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఈ విషయం తెలియజేశారు.