వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడానికి బీసీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది… ఆ బీసీ అభిమానం ఇప్పుడు తిరుమల కొండపైకి కూడా చేరుతోందంట… అదేంటంటారా? మీరే చూడండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు … ఇందులో భాగంగా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తన బాబాయిని సైతం తప్పించేందుకు వెనుకాడడం లేదంట… టీటీడీ పాలక మండలి నూతన చైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి నియామకం దాదాపు ఖాయమైందని అత్యంత విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలక మండలి పదవీ కాలం వచ్చే ఏడాది ఆగస్టుతో ముగియనుంది … కానీ వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలను వైవీ చూస్తున్న నేపథ్యంలో, పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించేందుకు టీటీడీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని తెలిసింది…. వైకుంఠ ఏకాదశి దర్శనాలు ముగిసిన తర్వాత చైర్మన్ బాధ్యతల నుంచి వైవీ తప్పుకోనున్నారంట.
ఈ నేపథ్యంలో టీటీడీ కొత్త చైర్మన్‌గా బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరును సీఎం ఖాయం చేసారంటున్నారు … ఈయన యాదవ సామాజిక వర్గ నేత. పల్నాడు జిల్లా గురజాలలో రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు …. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు… గత ఎన్నికల్లో కాసు మహేష్‌రెడ్డి కోసం ఈ బీసీ నేతకు టికెట్ ఇవ్వలేదు జగన్… అయితే తర్వాత జంగాకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు
ఇప్పుడు జంగాను టీటీడీ చైర్మన్‌గా నియమించి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు… గతంలో చంద్రబాబు కూడా పాలన చివరి రోజుల్లో పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు … అయినా చంద్రబాబుకి మొండిచెయ్యే చూపించారు ఏపీ ఓటర్లు … ఇప్పుడు జగన్ సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా టీటీడీ చైర్మన్‌గా బీసీ నేత అంటున్నారు… మరి చూడాలి అది ఎంత వరకు కలిసి వస్తుందో