Latest Posts

పిల్లలకు భగవంతుని పేర్లే ఎందుకు పెట్టాలి?

పిల్లలకు భగవంతుని పేర్లే ఎందుకు పెట్టాలి???
ఈరోజుల్లో ఇది చాలా పెద్ద సందేహం, ఎవరికైనా అభ్యంతరకరమైన విషయమే … అది అర్థం కూడా కాదు, కానీ దీని వెనకాల మనము తెలుసుకోవలసినది చాలా వుంది – ఒకసారి పరిశలిద్దాం!!…ఏ యుగములోనైనా మానవులు తరించడానికి అతి సులభమైన మార్గము ” భగవన్నామస్మరణ “…నిప్పును తెలిసి పట్టుకున్నా తెలయక పట్టుకున్నా కాలినట్లు , భగవంతుని నామమును తెలిసి పలికినా తెలియక పలికినా తరించడము నిశ్చయము…కానీ మనస్సు అత్యంత చంచలమైనది దాన్ని అదుపులో పెట్టి భగవంతుని నామాన్ని ధ్యానించడము అంత సులభసాధ్యము కాదు.దీనికి పరిష్కారముగా పెద్దలు సూచించిన మార్గము..పిల్లలకు భగవంతుని పేర్లను పెట్టడమే, ఇలా పెట్టడం వలన పిల్లలను పిలిచినప్పుడు, వారు గుర్తొచ్చినపుడు మనకు భగవంతుని స్మరించిన ఫలితము కలుగుతుంది…మన అందరికీ ‘అజామిళుని’ కధ తెలిసే ఉంటుంది కదా!!… మళ్ళీ ఒకసారి పరిశలిద్దాం…అజామీళుడు ఒక బ్రాహ్మణుడు, అతను దురదృష్టము కొలదీ దుష్కర్మములు ఎన్నో ఆచరించి భ్రష్టుడైనాడు…అతనికి ఎంతో ఇష్టుడైన తన కుమారునికి “నారాయణ” అని పేరు పెట్టి తరచుగా పిలుస్తుండేవాడు…అజామిళుడు చనిపోయే చివరి క్షణాల్లో తన కొడుకు “నారాయణ” ను పిలిచిన కారణం చేత విష్ణు దూతలు వచ్చి అజామిళుని వైకుంఠమునకు తీసుకువెళ్ళారు…ఇక్కడ మనం గమనించవలసినది కేవలం అజామిళుడు తన కుమారునికి “నారాయణ” అనే భగవంతుని పేరు పెట్టడం వల్లనే విష్ణు లోకాన్ని చేరాడు…అలా కాకుండా అజామిళుడు తన కుమారునికి ఏ “చిపక్ , చింగ్ పాంగ్, ” లాంటి పేర్లు పెట్టి ఉంటే తప్పకుండా నరకానికి వెళ్ళి ఎన్నో శిక్షలు అనుభవిస్తూ ఉండేవాడేమో…విష్ణు సహస్రనామాలు , శివ సహస్రనామాలు , లలిత సహస్రనామాలు వంటివి ఎన్నో అద్భుతమైన పేర్లను తెలుపుతాయి, వాటి అర్ధాలు కూడా తెలుసుకుని చక్కటి పేర్లు పెట్టవచ్చు…వాటిలో కొన్ని పేర్లు ఎంతో కొత్తవిగానూ ఉంటాయి ఉదాహరణకు “అనిర్వణ్” అంటే నిరాశ ఎరుగని వాడు అని అర్ధము…దీనిని బట్టి మనకు అర్థమవుతోంది అనుకుంటాను, పిల్లలకు భగవంతుని పేర్లే ఎందుకు పెట్టాలి అని…!!!

Latest Posts

Don't Miss