Latest Posts

పింఛన్లు రద్దు వైసిపీ పతనానికి మొదటి మెట్టు-సోమిరెడ్డి, బీద, అజీజ్

పక్కా ప్రణాళిక తో పింఛన్లు రద్దు చేశారు…

వైసీపీ నాయకులే పింఛన్లు రద్దు చేసి, వారే డ్రామాలు చేస్తున్నారు..

  • సోమిరెడ్డి, బీద, అజీజ్..

నెల్లూరు జిల్లాలో వేలాది పింఛన్లు రద్దు చేయడంతో వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతూ, జిల్లా కలెక్టర్ కు తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరసారత్నం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్, తదితర టీడీపీ నేతలు మంగళవారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20 వేలకు పైగా పింఛన్లు రద్దు చేస్తున్నట్లుu లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు..పేదోళ్లకు మూడెకరాల మాగాణి ఉందని, పదెకరాల మెట్ట ఉందని, 300 యూనిట్లకు పైగా కరెంట్ వాడారని పింఛన్లకు ఎసరుపెట్టారు.నోటీసులు అందుకున్న వారికి కూడా జనవరి 1న పింఛన్లు అందిస్తామని డీఆర్డీఏ పీడీ చెబుతున్నారు.కానీ కలెక్టర్ మాత్రం రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నోటీసుల్లోని సమాచారం కరెక్ట్ అయితే పింఛన్లు ఆపేస్తామంటున్నారు.20 వేల మందికి సంబంధించి రెండు రోజుల్లో సక్రమమైన విచారణ జరుగుతుందని మాకు నమ్మకం లేదు.ఈ రోజు పింఛన్లే పోతున్నాయి…రేపు వారికి అమ్మఒడి, వాహనమిత్ర, చేదోడు, విద్యాదీవెన వంటి పథకాలను కూడా ఆపేయబోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయడంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడి పేదలకు పథకాలు నిలిపేయబోతున్నారు.పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది..పింఛన్లు కానీ రద్దయితే సచివాలయం స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు అందరినీ నిలదీస్తాం.పేదల నోట్లో మట్టికొట్టే ఈ ప్రయత్నాలు ప్రభుత్వానికి తగవు.వేలాది మంది పేదలు నష్టపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు…సొంత వ్యాపారాల్లో మునిగితేలుతున్నారా..వైసీపీ ప్రజాప్రతినిధులకు రియల్ ఎస్టేట్లు, లేఅవుట్లు, గ్రావెల్, ఇసుక, టోల్ గేట్లు, తిప్పలు, కొండలు తప్ప ప్రజల కష్టాలు కనిపించడం లేదు.మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో జిల్లాలో ఇరిగేషన్ శాఖ భారీ కుంభకోణాలకు నిలయంగా మారింది.ఒక పనికే రకరకాల కేటగిరిల్లో బిల్లులు పెట్టుకుని కోట్లకు కోట్లు ప్రజల సొత్తు కాజేశారు.కలెక్టర్ స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటే సరి…లేదంటే న్యాయ పోరాటం తప్పదు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 65 వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి డీకేటీ పట్టాలు పంపిణీ చేశాంఅప్పట్లో మిగిలిపోయిన వాటిని ఇంకా పరిష్కరించకపోవడం బాధాకరం..సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అసైన్మెంట్ కమిటీ ఆమోదించిన పట్టాల పంపిణీని అడ్డుకున్నారు..ఆ సమస్యను పరిష్కరించాలని కోరాం.భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు విత్తనాల పంపిణీ అస్తవ్యస్తంగా జరుగుతోంది.యూరియా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో..ఆర్బీకేలకు వచ్చిన విత్తనాలు, యూరియాలను వైసీపీ నేతల ఇళ్లలో దించుకుని వారే పంచుకుంటున్నారు.ప్రజా సమస్యల విషయంలో తెలుగుదేశం పార్టీ రాజీ పడే ప్రసక్తే లేదు…ఇక నిరంతరం పోరాటాలే.ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ…విచిత్రమైన నిబంధనల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షల పింఛన్లను వైసిపి ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు…250 రూపాయలు పెంచుతామని చెప్పి దాదాపు నాలుగు ఏళ్ళు వెయ్యి రూపాయల లెక్కన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కోతేసిందని అన్నారు.వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఇష్టానుసారంగా పింఛను తొలగింపు కార్యక్రమం చేపట్టిందని, రేషన్ కార్డుల పరిస్థితి గందరగోళంగా ఉందని, చిత్తశుద్ది తో పని చేయాలని, వెరిఫికేషన్ కు సమయం తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు.ప్రభుత్వ లోపాల వలన, ప్రభుత్వం చేస్తున్న తప్పులకు పేద ప్రజలను బలి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులకు తెలియకుండా అధికార యంత్రాంగం అడుగు బయట పెట్టలేని, పేపర్ పై పెన్ను పెట్టలేని పరిస్థితిలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో గ్రామస్థాయి అధికారులు ఏ విధంగా పింఛన్లు తొలగించగలరు అని ప్రశ్నించారు.జిల్లాలో శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు పింఛన్లు వస్తున్నాయని బడా భూస్వాముల కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని, అలాంటి వారికి తొలగించాలని, అంతే కానీ పేద ప్రజలకు ఎకరా భూమి కూడా లేని వారికి తొలగించడం న్యాయం కాదని అన్నారు…ఇతర పార్టీల మీటింగులకు వెళ్లిన ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించిన పెన్షన్లు తొలగిస్తాం రేషన్ కార్డులు తొలగిస్తాం సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించే వైసిపి లాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు.కలెక్టర్ యూరియా తెప్పించానని చెబుతున్నారని అసలు వైసిపి నాయకుల ఇళ్లల్లో తప్ప మరెక్కడా యూరియా దొరకడం లేదని అన్నారు…వైసిపి నాయకులు ఇసుక గ్రావెల్ తో పాటు యూరియా బస్తాలను విత్తనాలను బ్లాక్లో అమ్ముకుంటున్నారని, జిల్లాలో వీరికి తెలియకుండా ఏమీ జరిగే పరిస్థితులు లేవని అన్నారు…జిల్లాలో వైసీపీ నాయకుల అనుమతులు లేకుండా, ప్రజలు కూడా ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు కూడా ఒక ట్రక్కు మట్టి తెచ్చుకునే పరిస్థితులు లేవని అన్నారు.పింఛన్లను వైసీపీ వారే తొలగిస్తూ పింఛన్లు తొలగించడానికి వారు వ్యతిరేకమని చెబుతున్నారని, పింఛన్లు తొలగిస్తే టీడీపీ ఒప్పుకోబోదని వెరిఫికేషన్ కు సమయాన్ని తీసుకొని యధావిధిగా పింఛన్లను మంజూరు చేయాలని అన్నారు…ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ…సాంకేతిక పరిజ్ఞానాల లోపాల వల్ల తొలగించిన పెన్షన్లు కాదని, ఒక ప్రణాళిక ప్రకారం నెల్లూరు జిల్లాలో 20వేల పెన్షన్లు తొలగించారని అన్నారు…సంక్షేమ పథకాలకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అయితే వివిధ రూపాల్లో పేదల కడుపు కొట్టి పదివేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు…కార్పొరేషన్ అధికారులు 4000 పెన్షన్లు రద్దయ్యాయని చెబుతున్నారని, కార్పొరేషన్ పరిధిలో దాదాపు తొమ్మిది వేల పెన్షన్లు రద్దయ్యాయని అన్నారు.పింఛన్లు తొలగించాలన్న దురాలోచనతో పాలూరు పింఛనుదారుల కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి ఆధార్ కార్డు నమోదు చేసి కరెంట్ బిల్లు 300 దాటిందని చూపి ప్రణాళిక ప్రకారం రద్దు చేశారని తెలిపారుజిల్లా అధికారులు రెండు రోజుల్లో సర్వే చేసి వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నారని రెండు రోజుల్లో అదంతా జరిగే పని కాదని మేము చేసాం కానీ పని అవ్వలేదు అని చెప్పడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని అన్నారు…. పించన్దారుల సమస్య పరిష్కారం కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు…వారితో పాటు కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మీ సురేంద్ర, ఊరందూరు సురేంద్ర బాబు, రాజా నాయుడు, పెంచల్ నాయుడు, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, అశ్లాం, సత్తార్, గోడ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss