Latest Posts

దళిత మహిళపై చెయ్యెత్తిన టీడీపీ మాజి మంత్రి…పరిటాల సునీత

పరిటాల సునీతకు షాక్….

  • దళితుల మీద టీడీపీకి ఎప్పుడు చిన్న చూపే….
  • అంటూ దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునిత..

రాప్తాడు మండలం మరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టికి చెందిన దళిత మహిళ కార్యకర్తపై మాజి మంత్రి పరిటాల సునితమ్మ ఏయ్‌…అంటూ చెయ్యెత్తి కొట్టే ప్రయత్నం చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మరూరు గ్రామంలో తెలుగుదేశం పార్టి చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పరిటాల సునితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిసి సామాజికవ వర్గానికి చెందిన ఆంజనేయులుతో కాళ్లు మొక్కించుకున్న పరిటాల సునితమ్మ…దళిత మహిళను కొట్టే ప్రయత్నం చేసింది. భూ సమస్యల్లో పరిటాల సునితమ్మ పక్కనే తిరుగుతున్న వ్యక్తి మోసం చేశాడంటూ దళిత మహిళ నిలదీసింది. తన పక్కన ఉన్న వ్యక్తిని మాట్లాడతావా… అంటూ సునితమ్మ చేయి పైకి ఎత్తి ఏయ్‌…అంటూ గద్దించింది. సదరు దళిత మహిళ ఏమాత్రం తగ్గకుండా అంతేస్థాయిలో స్పందించింది. ఇలాంటి వాళ్లను పక్కన పెట్టుకుని తిప్పితే నీ పార్టీనే నాశనం అయిపోతాదంటూ శాపనార్థాలు పెట్టింది.

Latest Posts

Don't Miss