Latest Posts

జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ గా మీరం బాషా

  • -జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్ గా జిఎంఎస్ మీరం బాషా నియామకం.
  • -ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర సీఈఓ అబ్దుల్ ఖదీర్.
  • -మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన మీరంబాషా.

  అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డ్ మెంబర్ గా ఉరవకొండకు చెందిన జిఎంఎస్ మీరం బాషా ( స్వర్గీయ జిఎంఎస్ హఫీజ్ కుమారుడు) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ అబ్దుల్ ఖదీర్ ఉత్తర్వులు విడుదల చేశారు.అలాగే అధ్యక్షుడుగా రిజ్వాన్,ఉపాధ్యక్షుడుగా అహమ్మద్ బాషా, సెక్రెటరీగా నూర్ తో కలిపి మరో 7 మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది.ఈ సందర్భంగా మీరం బాషా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు మెంబర్ గా నన్ను నియమించేందుకు కృషి చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డికి, నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎప్పటికి ఋణపడి వుంటానన్నారు. తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ముస్లింల సంక్షేమానికి పాటుపడతానని, వక్ఫ్ ఆస్తులు పరిరక్షణ, మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని మీరం బాషా చెప్పారు.

  Latest Posts

  Don't Miss