Latest Posts

జగన్ ఢిల్లీ టూర్ పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ

    • జగన్ సడెన్ ఢిల్లీ టూర్ దేని కోసం ?
    • కొత్త అప్పుల కోసమా ? ముందస్తు కోసం కసరత్తా ?
    • ఢిల్లీ టూర్ పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ.

    ఏపీ సీఎం జగన్ సడెన్ ఢిల్లీ టూర్ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చలకు కారణం అవుతోంది. అదనపు అప్పుల కోసం లేదా ముందస్తు ఎన్నికలకు అనుమతి కోసం ఆయన డిల్లీ పర్యటన చేస్తున్నారని అంటున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ఆ తర్వాత అమిత్ షానూ కలుస్తారని చెబుతున్నారు. కొంత మంది కేంద్ర మంత్రుల్నీ కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న సమాచారం తప్ప దేని కోసం అనే విషయం ఎప్పుడూ ప్రభుత్వ వర్గాలు చెప్పవు. మోడీతో భేటీ అయిన తర్వాత ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. అందులో ఎప్పుడూ ఇచ్చే వినతి పత్రంలోని అంశాలే ఉంటాయి. అదే సమయంలో గతంలో ఢిల్లీకి వెళ్లే ప్రతీ ముఖ్యమంత్రి కీలక భేటీలు అయ్యాక మీడియాతో మాట్లాడేవారు. కానీ సీఎం జగన్ అసలు మీడియాతో మాట్లాడరు. దీంతో ఢిల్లీ పర్యటనల్లో జగన్ ఏం మాట్లాడారన్నదానిపై రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. ఈ సారి కూడా బయటకు తెలియని భేటీలే జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సారి కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయడం మొదటి ప్రయారిటీ ? : ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం సీఎంవో కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో సీఎం జగన్ ముందుగా ఖరారు చేసుకున్న టూర్స్ రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. వాస్తవానికి 28వ తేదీన జగన్ నర్సీపట్నంలో పర్యటించాల్సి ఉంది. కానీ 30వ తేదీకి వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అంటే ప్రధానంగా అందరికీ అదనపు అప్పలకు పర్మిషన్ అంశమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఒకటో తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో ఉద్యోగులకే కాదు. ప్రభుత్వానికీ టెన్షన్ తప్పడం లేదు. నవంబర్ నెల జీతాలు డిసెంబర్ 22వ తారీఖుకు అందరికీ ఇవ్వగలిగారు. ఇప్పుడు మళ్లీ నెల వచ్చేస్తోంది. సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు వంటి వాటికి కలిపి కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఓడీలోనే ఉందన్న ప్రచారం జరుగుతోంది. తప్పనిసరిగా అప్పు పుట్టకపోతే సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వలేరు. పైగా ఈ నెల 250 రూపాయలు పెంచుతున్నారు. అందుకే ముందస్తుగా అప్పుల కోసం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్తున్నారని అంటున్నారు.ఢిల్లీలో బుగ్గన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సీఎం రంగంలోకి దిగారా ? : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. అదనపు అప్పుల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి ఆయన స్థాయి కూడా దాటిపోవడంతో నేరుగా జగన్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీతో కేంద్ర ఆర్థిక మంత్రి ఉచితాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్‌ లో ఓ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని నెగెటివ్ కామెంట్స్ కూడా చేశారు. అది ఏపీని ఉద్దేశించేనని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదనపు అప్పులకు అనుమతి రావాలంటే నేరుగా సీఎం రంగంలోకి దిగాల్సిందేనని భావించి జగన్ మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లుగా చెబుతున్నారు. అప్పులకు పర్మిషన్ దొరకకపోతే మాత్రం ఏపీ ప్రభుత్వం ఈ నెల కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

    Latest Posts

    Don't Miss