Latest Posts

కేసీఆర్ రాజీనామా చేయాలి: వేల్పూరి శ్రీనివాసరావు

నిజామాబాద్ నందిపేటలో మున్నూరు కాపులను సంఘిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: దక్షిణ భారత కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు డిమాండ్.

నిజామాబాద్ జిల్లా లోని నందిపేట మండలం లోని సపూర్ గ్రామం లో 80 మున్నూరు కాపు కులానికి చెందిన కుటుంబం లను గ్రామం నుండి బహిష్కరించడం బంగారు తెలంగాణకు అవమానమని, దీనికీ నైతిక బాధ్యతగా సిఎం కెసిఆర్ రాజీనామా చేయలి అని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బంగారు తెలంగాణ లో SC, BC లకు రక్షణ లేదు అని వేల్పూరి ఆందోళన వ్యక్తం చేసారు. నిజామాబాద్ జిల్లా లోని ఎస్పీ, కలెక్టర్ లను సస్పెండ్ చేయాలని వేల్పూరి డిమాండ్ చేశారు. అన్నీ కాపు సంఘాలు ఖండించాలి అని విజ్ఞప్తి చేసారు.దీనికి బాధ్యులు ను అందరిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి అని వేల్పూరి డిమాండ్ చేసారు. సాంఘిక బహిష్కరణ పై రాష్ట్రం, జాతియ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని వేల్పూరి పేర్కొన్నారు.

Latest Posts

Don't Miss