ఎస్ఐ దరఖాస్తుల గడువు 18 వరకూ పొడిగింపు
సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు పోలీసు శాఖ గడువు పొడిగించింది.
పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు పోలీసు శాఖ గడువు పొడిగించింది. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 411 ఎస్ఐ పోస్టులకు నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 14 నుంచి ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తోన్న దరఖాస్తుల గడువు జనవరి 1గా పేర్కొంది. అయితే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వయో పరిమితి రెండేళ్లు పెంచడంతో వచ్చేనెల 18 వరకూ గడువును పొడిగించింది.