పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కుని ఇద్దరు యువకుల ప్రాణాలను ప్రభుత్వం బలిగొందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుడు యాదాద్రి-భువనగిరి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన బాలస్వామి పరిహారం రాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోగా, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం కోసం తమ భూమిని లాక్కున్నారనే ఆవేదనతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లకు చెందిన నందీశ్వర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటనలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ రెండు విషాద ఘటనల్లో ప్రభుత్వమే దోషి అని ఆరోపించారు.ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ రాసింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో ఈ లేఖను విడుదల చేశారు. పీఆర్సీ కాలపరిమితి జూన్ నాటికి పూర్తవుతున్నందున ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.