Latest Posts

ఇకనుండి ఇంటికి కాప‌లాగా నాగుపాము

ఆ ఇంటికి కాప‌లాగా.. నాగుపాము
ప్ర‌తి ఇంటి వ‌ద్ద కుక్క‌లు కాప‌లాగా ఉంటాయి. కాప‌లా కోసం కొంద‌రు కుక్క‌ల‌ను పెంచుకుంటారు. శ‌త్రువుల దాడి నుంచి త‌ప్పించుకునే విష‌యంలో కుక్క‌లు ఎంతో మేలు చేస్తుంటాయి. కానీ ఈ ఇంటి వ‌ద్ద కుక్క‌కు బ‌దులుగా పాము కాప‌లా ఉంది. అది కూడా నాగుపాము.ఇంటి త‌లుపు నుంచి బ‌య‌ట‌కు దూరి.. ప‌డ‌గ విప్పి బుస‌లు కొడుతూ.. ఇంట్లోకి ఎవ‌ర్నీ రాకుండా అడ్డుకుంది. ఆ పాము ప‌డ‌గను చూస్తే ఒళ్లంతా గ‌గుర్పాటుకు గురికాక త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం ఈ వీడియో https://twitter.com/TheFigen_/status/1607423620543913986 సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.అయితే ఆ ఇంట్లోకి దూరిన నాగుపాము త‌లుపు వెనుకాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు య‌త్నించింది. అదే స‌మ‌యంలో త‌లుపు, ద‌ర్వాజా మ‌ధ్య ఉన్న ప్లేస్ నుంచి ప‌డ‌గ విప్పింది. బుస‌లు కొడుతున్న పామును చూసి ఆ ఇంటి వారు, స్థానికులు ప‌రుగెత్తారు. పామును వీడియో తీస్తున్న వ్య‌క్తిపై దాడి చేసేందుకు య‌త్నించింది.
ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇంటికి కాప‌లాగా కుక్క‌ల స్థానంలో పాములు వ‌చ్చాయ‌ని జోకులు పేలుస్తున్నారు. ఆ వీడియోను చూసిన వెంట‌నే నాకు గుండెపోటు వ‌చ్చింద‌ని మ‌రికొంద‌రు కామెంట్ చేశారు. ఇంటి భ‌ద్ర‌త కోసం పాములు బెట‌రేమో అని కొంద‌రు వ్యాఖ్యానించారు.

Latest Posts

Don't Miss