Latest Posts

శబరిమల ఆలయానికి సమకూరిన భారీ ఆదాయం

శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం.. 39రోజుల్లోనే రూ.223 కోట్లు
శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది
39 రోజుల వ్యవధిలో రూ.222 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది.
★ స్వామి దర్శనానికి చిన్నారులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపింది.*
★ శబరిమల అయ్యప్పపై కాసుల వర్షం కురిసింది. ఆలయానికి 39 రోజుల వ్యవధిలో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
★ నవంబర్ 17న మండల పూజలు ప్రారంభం కాగా.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు శబరిమల దర్శనానికి పోటెత్తారు.
★ భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన నేపథ్యంలో హుండీ ఆదాయం సైతం గణనీయంగా నమోదైంది.
★ మొత్తంగా రూ.222.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్​కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ వెల్లడించారు. ఇందులో భక్తులు నేరుగా సమర్పించిన మొత్తం రూ.70.15 కోట్లు అని చెప్పారు.
★ సుమారు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని… అందులో ఐదో వంతు చిన్నారులే ఉన్నారని తెలిపారు.
★ గడిచిన రెండేళ్లలో రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి చిన్నారులు భారీ సంఖ్యలో దర్శనానికి వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు.
★ కాగా, 41 రోజుల మండల పూజలు మంగళవారంతో ముగియనున్నాయి.
★ స్వామివారికి మధ్యాహ్నం పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసేయనున్నారు.
★ మూడు రోజుల విరామం అనంతరం డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు పర్వదినం కోసం అయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు.
★ మకర సంక్రాంతి రోజున భక్తులు జ్యోతి దర్శనం చేసుకోనున్నారు.
★ అనంతరం జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.

Latest Posts

Don't Miss