Latest Posts

లూయీ పాశ్చర్ గారి సేవలు చిరస్మరణీయం

శాస్త్రవేత్త డాక్టర్ శ్రీ లూయీ పాశ్చర్ గారి సేవలు చిరస్మరణీయం

కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి

డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్

సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

డిసెంబర్ 27 న ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త శ్రీ లూయీ పాశ్చర్ గారి జయంతి సందర్బంగా
డోన్ పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ ఎస్. మహమ్మద్ హనీఫ్ అధ్యక్షతన శాస్ర్రవేత్త శ్రీ లూయీ పాశ్చర్ గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డి ఆర్. కె. రెడ్డి, డాక్టర్ తాజముల్ హూశేన్,డాక్టర్ శశికుమార్ , డాక్టర్ రమ్యశిల్ప , డాక్టర్ రాజశేఖర్ ,డాక్టర్ అపర్ణకుమారి, డాక్టర్ యమునాకూమారి , డాక్టర్ మాధవి వైద్యశాల సిబ్బంది మాధవి, ధర్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు
శ్రీ లూయీ పాశ్చర్ (Louis Pasteur) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణమైన సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబిస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.లూయీ పాశ్చర్ ఫ్రెంచి సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడు మరియు రసాయన వేత్త. ఈయన 1822 డిసెంబరు 27 జన్మించారు.చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు. మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్ మరియు ఫెర్డినాండ్.పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం Louis పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.
1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.
ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనుషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు. పాశ్చర్ సూక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు.ఇలాంటి మహనుభావులను స్మరించుకుంటు వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్,
సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.
కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలతో మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటూ జన సమూహలకు దూరంగా ఉంటూ ఇమ్యూనిటీ పెంచే ఆహారం తీసుకుంటూ
ఆరోగ్యాలను కాపాడుకోవాలని డోన్ ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ ఎస్. మహమ్మద్ హనీఫ్,
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
తెలిపారు.

Latest Posts

Don't Miss