రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డా KS.జవహర్ రెడ్డి ఐ. ఏ. ఎస్. , ఏ.పి.జె.ఏ.సి.అమరావతి చైర్మెన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వి. రావు ఆధ్వర్యంలో ఇటీవల “ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం” కు జరిగిన ఎన్నికలలో రాష్ట్ర సంఘానికి ఏక్రీవంగా ఎన్నికైన రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎస్. మల్లేశ్వరరావు, రాష్ట్ర సంఘ ప్రధానకార్యదర్శి తోట చెన్నప్ప, రాష్ట్ర కోశాధికారి ఆర్.శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి కె.కొండయ్య, NTR. జిల్లా అధ్యక్షులు ఏ. ఆదినారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్. విద్యాసాగర్ తదితరులు CS గారిని వారి క్యాంప్ కార్యాలయంలో కలిసి, వారిని దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు … నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికల అధికారి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని CSకి అందజేసి, నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పరిచయం చేశారు.
ఈ సదర్భంగా నూతనంగా ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘానికి ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు యన్.మల్లేశ్వరరావు మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను, మేము దాచుకున్న GPF, APGLI డబ్బులు, DA బకాయిలు, PRC బకాయిలు, కొత్తగా ఇవ్వవలసిన DA లు అన్నియు తక్షణమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కోరడమైనది.
అలాగే ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘానికి ఓడి (OD) సదుపాయం కల్పించమని…
అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.