Latest Posts

మోడీ,జగన్ ఇద్దరూ మోసగాళ్లే- అక్కినేని వనజ

మోడీ జగన్ మోసపూరిత మాటలను ప్రజలకు వివరించండి

  • గ్రామస్థాయి నుండి సిపిఐ ను బలోపేతం చేయండి.
  • సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ.

కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతూ తన మోసపూరిత మాటలతో ప్రజలను వంచిస్తున్నరని వీటిపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు.సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా ఆమెకు పార్టీ చిరు సత్కార సభ నిర్వహించింది దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు .ముందుగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తదితర రంగాలు పై అధిక భారం మోపుతూ సామాన్య ప్రజానీకం నడ్డి విరుస్తున్నారని ఆయన అన్నారు ఎన్నికల ముందు నరేంద్ర మోడీ అనేక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదన్నారు దేశంలో నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతుందని అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని వీటిపై గ్రామస్థాయి నుండి ప్రజా పోరాటాలు చేయడం ద్వారా సిపిఐ బలోపేతం అవుతుంది అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ విద్యార్థులు యువజనులు మహిళలు పార్టీ సభ్యత్వం తీసుకుని సమసమాజ స్థాపన శ్వాసలిజం లక్ష్యంగా పనిచేయాలన్నారు అనంతరం ఆమెకు చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సహాయ కార్యదర్శి సప్ప రమణ జిల్లా కార్యవర్గ సభ్యులు కే జ్యోతి రాజు లక్ష్మణ్ చింతలపూడి సునీల్ జిల్లా సమితి సభ్యులు నలా రామరావు నౌరుజి ,ఉమా ప్రజానాట్యమండలి ,జట్ల సంఘం అధికార పార్టీ ప్రెసిడెంట్లు శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

మోడీ,జగన్ ఇద్దరూ మోసగాళ్లే- అక్కినేని వనజ
మోడీ,జగన్ ఇద్దరూ మోసగాళ్లే- అక్కినేని వనజ

Latest Posts

Don't Miss