Latest Posts

“మావా మావా జగన్ మావా”అంటూ పాటలతో సిఎం నిపొగడ్తలతో ముంచెత్తిన DNR

భావితరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ టెక్నాలజీ తో చదువును అందించే వ్యవస్థకు ముఖ్యమంత్రి జగనన్న శ్రీకారం చుట్టారని..ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాల వైపు సాగిపోవాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.ఈ మధ్యాహ్నం ముదినేపల్లి మండలంలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు BY JUS TABS పంపిణీ నిమిత్తం ముదినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే DNR ముఖ్యఅతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ మేనమామ గా జగనన్న మీకు అందిస్తున్న సాయం విలువ కట్టలేనిదని అన్నారు.కేవలం పాఠ్యంశాలు మాత్రమే ఉండేలా ప్రత్యేక టెక్నాలజీ తోరూపొందించిన టాబ్ ల మూలంగా ఏ విధమైన పెడత్రోవకు అవకాశం లేదని అన్నారు. రానున్న రోజుల్లో పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్ ల దిశగా విద్యావ్యవస్థను జగనన్న నడిపించబోతున్నారని అన్నారు. మీరు మీ మీ ఇళ్ల కు వెళ్లి మీ జగన్ మావ ఇచ్చిన ట్యాబ్ లు ఆనందంగా చూపించి.. మేనమామ నూతన సంవత్సర కానుక ఇచ్చాడని చెప్పండి అని అన్నారు. ఈ సమయంలో విద్యార్థినీ విద్యార్థుల మనసుల్లో ఎలాగుందో చెప్పనా అంటూ
” మావా మావా జగన్ మావా మీరంటే మాకెంతో ఇష్టం.. మావా మావా జగన్ మావా మీ పాలన మా అదృష్టం” అంటూ ఎమ్మెల్యే DNR పాట రూపంలో పాడేసరికి విద్యార్థుల కేరింతలు.. చప్పట్లు మిన్నంటాయి.అనంతరం మండలంలోని 18 గ్రామాలనుండి విచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే DNR చేతులమీదుగా ట్యాబ్స్ పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలోఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య,మండల వైసిపి అధ్యక్షులు ఏసుబాబు, వైస్ ఎంపీపీ రాచూరి రాధా,మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కరేటి గోవిందరాజులు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు శీలం రామకృష్ణ, గ్రామ సర్పంచ్ నిమ్మగడ్డ కైకమ్మ, నాయకులు కోమటి విష్ణువర్ధన్, ఈడే వెంకటేశ్వరరావు,గూడపాటి వరప్రసాద్,సాక్షి సాయిబాబా,బేతపూడి వెంకటరమణ,సోమా సత్యనారాయణ,ముత్యాల రాంబాబు,బేతు రాజా,రాచూరి కుమార్, దివి సతీష్,బోయిన అప్పన్న,ఎంపీడీఓ మల్లీశ్వరి,ఎంఈఓ దొడ్డా రామారావు, ఈఓఆర్డీ విజయసారధి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, CRP లు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest Posts

Don't Miss