Latest Posts

మదనపల్లె మామిడి తోపులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

  • మదనపల్లె పట్టణ సమీపం ఓ గెస్ట్ హౌస్ ప్రాంగణం మామిడి తోపులో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం బెంగుళూరు రోడ్డు తాలిరెడ్డి గెస్ట్ హౌస్ మామిడి తోటలో గుర్తు తెలియని వ్వక్తి దారుణ హత్యకు గురయ్యారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించామని మదనపల్లి డిఎస్పీ కేశప్ప,సీఐ సత్యనారాయణ తెలిపారు..
ఈ ఘటనపై డీఎస్పీ కేశప్ప విలేకరులకు వివరణ ఇస్తూ స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఘటన స్థలానికి చేరుకున్నామని హత్య ఘటన స్థలాన్ని పరిశీలిస్తే శరీరం నుండి తలను వేరుచేసి మొండెం పడేశారని తల కనిపించడం లేదని వ్యక్తిని మద్యం మత్తులో వుంచి హత్యచేసి వుంటారని‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
సంఘటన స్దలంలో ఆనవాళ్ళు సేకరిస్తున్నామని డాగ్ స్క్వాడ్ రప్పించి హంతకుల గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.నిందితుడి ద్విచక్ర వాహనం ద్వారా గుర్తింపు పనిలో పడ్డారు..

Latest Posts

Don't Miss