Latest Posts

బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి మండలంలో అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఒక్కసారిగా ఆ పార్టీకి చెందిన 18 మంది సర్పంచ్‌లు రాజీనామా చేశారు. రాజీనామా చేసినవాళ్లంతా ఆదివాసీ సర్పంచ్‌లే. నిధులు లేమితో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వాళ్లు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తమను పట్టించుకోవడం లేదంటున్నారు. ఆదివాసీ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధిపై ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే.. మాట్లాడేందుకు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యవహారం నచ్చకనే రాజీనామా చేస్తున్నామని, ఆయన వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులేవీ జరగలేదని ఆరోపించారు వాళ్లు. రాజీనామాలపై పద్దెనిమిది గ్రామాల సర్పంచ్‌లు సంతకాలు చేశారు. వాటిని మండల అధ్యక్షుడికి ఇవ్వనున్నట్లు తెలిపారు.

Latest Posts

Don't Miss