కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని విమర్శించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
అన్నం పెట్టే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. రైతుబంధు ఇచ్చి దానకర్ణులమన్నట్లు గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కో రైతుపై రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడంపై ఆయన సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. అప్పుల భారంతో రైతుల మెడకు బిగిస్తున్న ఉరితాళ్ల గురించి మోదీ, కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మిషన్ భగీరథ కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల కరెంటు 15 గంటలకు తగ్గించారని విమర్శించారు.